- Advertisement -
నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాలను కల్పించుటకు ఈ నెల 10న జిల్లా ఉపాది కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పన అధికారి మిల్కా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపిక కాబడిన వారికి రూ.16 వేల నుండి 19వేలు ఇతర అలవెన్సులు ఉంటాయన్నారు. 18సం.ల నుండి 35సం.ల లోపు గల యువతీ యువకుకులు అర్హులని పేర్కొన్నారు. అర్హత ఆసక్తి గల జిల్లా నిరుద్యోగ యువతి యువకులు తమ బయో డేటా విద్యార్హతల సర్టిఫికేట్ తో పాటు అధర్ కార్డు, పాన్ కార్డు జిరాక్స్ కాపిలతో జిల్లా ఉపాది కార్యాలయంలో ఉదయం 10:30 గం.లకు హాజరు కావాలని కోరారు. పూర్తి వివరాలకు ఈ 8247656356, 7207917714 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
- Advertisement -