మణుగూరు ఓసి భూ నిర్వాసితులు..
నవతెలంగాణ – మణుగూరు
మణుగూరు ఓసి భూ నిర్వాసితులకు సింగరేణిలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆదివాసి సింగరేణి ల్యాండ్ లూజర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కోడి నాగరాజు తెలిపారు. శుక్రవారం వాసవి నగర్ లో గల ఆదివాసి భవనంలో భూ నిర్వాసితులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గిరిజన చట్టాలకు వ్యతిరేకంగా గ్రామసభలు నిర్వహించారని అన్నారు. భూ నిర్వాసితులు హైకోర్టును ఆశ్రయించమన్నారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుమ హైకోర్టుకు నకిలీ డాక్యుమెంట్లను సమర్పించారని అన్నారు. గ్రామపంచాయతీలో ఉన్న డాక్యుమెంట్లకు కోర్టు సంబంధించిన డాక్యుమెంట్లకు వ్యత్యాసం ఉందన్నారు. గ్రామ సభలో 182 మంది నిర్వాసితుల సంతకాలు ఉండగా.. కోర్టుకు సమర్పించిన పత్రాలలో 220 సంతకాలు ఉన్నాయన్నారు. స్పెషల్ ఆఫీసర్ ని తొలగించాలని, మళ్లీ గ్రామసభలు నిర్వహించాలని, భూములు కోల్పోయిన గిరిజన కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సోడి రవికుమార్, కుంజ ఆనంద్, వెంకటేశ్వర్లు, కారు నరసింహ రావు, చరణ్, గణేష్, ఎల్లిబోయిన సతీష్, కుంజ నాగ శర్మ, సోయం నాగేశ్వరరావు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
ఉద్యోగ అవకాశాలు కల్పించాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES