Friday, July 11, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంజీఏడీ ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి ఉద్యోగ రెన్యూవల్‌ పొడిగింపు

జీఏడీ ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి ఉద్యోగ రెన్యూవల్‌ పొడిగింపు

- Advertisement -

– తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు,
– ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ హర్షం
పోరాటాల ఫలితమే : జె.వెంకటేశ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్ర సచివాలయంలో జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగంలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది ఉద్యోగ కాలవ్యవధిని ఏడాది పాటు పెంచుతూ రాష్ట్ర సర్కారు రెన్యూవల్‌ చేయడాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ హర్షం వ్యక్తం చేసింది. తమ ఫెడరేషన్‌ పోరాటాల ఫలితంగానే జీవో నెంబర్‌ 1114 విడుదలైందని పేర్కొంది. మిగిలిన ప్రభుత్వ శాఖల్లోని కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని రెన్యూవల్‌ చేయాలని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు జె.వెంకటేశ్‌, ప్రధాన కార్యదర్శి జె.కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షులు పద్మశ్రీ, కార్యదర్శి జె.కుమారస్వామి ఒక ప్రకటన విడుదల చేశారు. జీఏడీ ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి రెన్యూవల్‌ నిలుపుదల సరిగాదనీ, తక్షణ రెన్యూవల్‌ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు పలుమార్లు వినతిపత్రాలిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. జులైన మూడో తేదీన ఫెడరేషన్‌ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ధర్నా చేశామని తెలిపారు. జిల్లాల్లోనూ ఆందోళనలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి రెన్యూవల్‌ జీవో 1114ని విడుదల చేసిందని తెలిపారు. ఈ అనుభవంతో వివిధ శాఖల ఉద్యోగులు కూడా తమ రెన్యూవల్‌ కోసం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -