Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంజీపీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి

జీపీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి

- Advertisement -

– కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి
– సీఐటీయూ నాయకులు అర్జున్ డిమాండ్
నవతెలంగాణ – అశ్వారావుపేట

పంచాయతీ సిబ్బంది గ్రామాల్లో పారిశుధ్యం పనులు నిర్వహిస్తూ ప్రజలు అనారోగ్యం పాలు కాకుండా వారిని కాపాడుతున్నారని, భారత రాజ్యాంగం సైతం పారిశుద్ధ్య పనులు చేస్తున్న వారికి ప్రభుత్వాలు ఉపాధి కల్పించాలని స్థిరమైన వేతనాలు ఇవ్వాలని చెబుతున్నప్పటికీ ఆ బాధ్యత నుండి ప్రభుత్వాలు తప్పు కుంటున్నాయని గ్రామపంచాయతీ కార్మికుల చేత వెట్టి చాకిరి చేయిస్తున్నారని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ అన్నారు. గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) మూడవ అశ్వారావుపేట మండల మహాసభ ఆదివారం మండలం లోని వినాయకపురం లో చందా రామారావు అధ్యక్షతన నిర్వహించారు.

ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీ సిబ్బందిని అందరినీ రెండవ పీఆర్సీ పరిధిలోకి తీసుకువచ్చి,వారికి కనీస వేతనం రూ. 26 వేలు చెల్లించాలని,కాంగ్రెస్ ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే ఎన్నికల హామీ మేరకు ప్రతి కార్మికుడికి ఉద్యోగ భద్రత,పీఎఫ్,ఈఎస్ఐ,జీవిత భీమా,ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తామని వాగ్దానం చేసి ఆ మాటే మరిచి పోయిందని అన్నారు.గత జనవరిలో సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీ కార్మికులకు గ్రీన్ ఛానల్ ద్వారా నేరుగా వారి అకౌంట్లో నే బిల్లులు చెల్లిస్తామని చెప్పి ఈ ఆరు నెలలలో ఒక్క నెల కూడా గ్రీన్ ఛానల్ ద్వారా జీతాలు చెల్లించలేదని,ఎన్నికల హామీలను అమలు చేయాలని,పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని ఆందోళన నిర్వహిస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పూనుకుంటుంది అని దుయ్యబట్టారు.అర్హత కలిగిన వారికి కారో బార్ బిల్ కలెక్టర్ లు గా అవకాశం ఇవ్వాలని, అర్హత కలిగిన ప్రతి  కార్మికుడికి  ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మండల కమిటీ ఎన్నిక :

అనంతరం 22 మందితో మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు.గ్రామపంచాయతీ కార్మికుల మండల అధ్యక్షుడిగా యాదగిరి వెంకటప్పయ్య,మండల ప్రధాన కార్యదర్శి గా కొడిమి వినోద్,సహాయ కార్యదర్శిగా కొనకళ్ళ మహేష్, మరో సహాయ కార్యదర్శిగా కుంజా బాలరాజు, ఉపాధ్యక్షులుగా సోడెం కన్నారావు,చందా రామారావు, డేరంగుల వెంకయ్య, కోశాధికారిగా వేల్పుల ముత్తా రావు,మండల కమిటీ సభ్యు లుగా చిచ్చొడి విజయ్,బేతి రాజు, ఎం.సీతారాములు, మడివి తిరుపతిరావు,గడ్డం సురేంద్ర, యాట్ల వెంకటేశ్వరరావు,మొడియం శ్రీను,కొర్రి మల్లయ్య,మడివి చినబాబు, కట్టం సింగరాజు, కొనుసోతు రాంబాబు,భూక్య సురేష్,పల్నాటి రాజా లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad