Saturday, July 26, 2025
E-PAPER
Homeఎడిట్ పేజియోధునికి జోహార్లు...

యోధునికి జోహార్లు…

- Advertisement -

దోపిడీపై ధ్వజమెత్తిన
ఉద్యమాల శిఖరమతడే
అలుపెరగని అరుణతార
పరిపాలన దక్షుడతడే

పోరుబాట పొద్దుపొడుపు
పరిపూర్ణపు నేతయతడే
సంస్కరణల చంద్రుడు
సమర్థతల రత్నమతడే
వామపక్ష సవ్యసాచి
సమరశీల భానుడతడే
సమభావన సేతువు
విశ్వశాంతి క్రాంతియతడే

మచ్చలేని మహానేత
పురోగమన జ్యోతియతడే
స్వచ్ఛమైన త్యాగజీవి
ప్రజాస్వామ్య ప్రమిదయతడే

నిక్కమైన నీలమణి
వెనుతిరగని ధీరుడతడే
మొక్కవోని దీశాలి
ఎగసిపడే సంద్రమతడే

శ్రామికజన ప్రియనేత
విప్లవాల మార్గమతడే
గిరిజన జన ఘననేత
కమ్యూనిస్టు యోధుడతడే
– పిఎన్‌ మూర్తి, 9441151762

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -