Thursday, October 9, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసీపీఐ(ఎం) నాయకుల అరెస్టుకు జాన్‌వెస్లీ ఖండన

సీపీఐ(ఎం) నాయకుల అరెస్టుకు జాన్‌వెస్లీ ఖండన

- Advertisement -


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మక్తల్‌-నారాయణపేట-కొడంగల్‌ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతాంగానికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం న్యాయమైన పరిహారం ఇవ్వాలంటూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జి వెంకట్రామరెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గోపాల్‌, బాల్‌రాం, అంజయ్య గౌడ్‌, జిల్లా కమిటీ సభ్యులు జోషి, నాయకులు మహేష్‌ కుమార్‌ గౌడ్‌, రామకృష్ణలను అరెస్టు చేయడాన్ని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. మక్తల్‌-నారాయణపేట-కొడంగల్‌ ఎత్తిపోతల పథకానికి డిటెయిల్డ్‌ ప్రాజెక్టు రిపోర్ట్‌ (డీపీఆర్‌) ఇప్పటివరకు ప్రకటించలేదని విమర్శించారు. ఎంత భూమి అవసరమవుతుందో స్పష్టమైనటువంటి ప్రకటన లేదని తెలిపారు. బలవంతంగా రైతుల భూముల్లోకి వెళ్లి సర్వే నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. నాయకులను అరెస్టు చేసి భూ సర్వే నిర్వహిం చడం, నిర్బంధం ప్రయోగించడం సరైంది కాదని తెలిపారు. ఇప్పటికే రైతుల మీద నాయకుల మీద కేసులు కూడా నమోదు చేశారని వివరించారు. ఈ కేసులను వెంటనే ఎత్తేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -