Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్మాజీ ఎమ్మెల్యే షిండే సమక్షంలో బీఆర్ఎస్ లోకి చేరికలు

మాజీ ఎమ్మెల్యే షిండే సమక్షంలో బీఆర్ఎస్ లోకి చేరికలు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
ప్రజలకు 420 హామీలిచ్చి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఏ ఒక్కటీ సక్రమంగా అమలు చేయలేదని అన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. వృద్దులకు పెన్షన్లు పెంచుతామని, రూ.500 బోనస్ సన్నవడ్లకు ఇస్తామని, రుణమాఫీ పూర్తిగా చేస్తామని, మహిళలకు రూ.2500 ఇస్తామని, తులం బంగారం ఊసేలేదని, ప్రజలను నమ్మించి, బూటకపు మాటలు చెప్పి గద్దెనెక్కిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని తెలిపారు.

ఇందుకు సాక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నుండి మద్నూర్, అంతాపూర్, గ్రామాలకు చెందిన పలువురు నాయకులు నా సమక్షంలో బిఆర్ఎస్ లోకి భారీగా చేరారని వెల్లడించారు. ఆ పార్టీలో నాయకులకు, కార్యకర్తలకు గౌరవం గుర్తింపు లేకనే పలువురు నాయకులు, కార్యకర్తలు తల్లి లాంటి పార్టీ బి ఆర్ఎస్ పార్టీ లోకి చేరెందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారని అన్నారు. గతంలో బిఆర్ఎస్ పార్టీలో ఒక నాయకుడు చేసిన తప్పిదాలకు పార్టీ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయారని, ఆ పార్టీలో గౌరవం గుర్తింపు లేకనే మళ్లీ బిఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నారని అన్నారు. మద్నూర్ మండల కేంద్రానికి చెందిన థైదల్ రాజు పలువురు వార్డు సభ్యులు ఇతరులు కలిసి మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. వారికి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ పార్టీ కండువా కప్పి పార్టీలోకి చేరుకున్నారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బి ఆర్ఎస్ పార్టీ సత్తా చూపడం ఖాయమని, నాయకులు కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. అధికారం ఉంది కదా అంటూ బిఆర్ఎస్ పార్టీ నాయకుల పైన, కార్యకర్తల పైన అధికార పార్టీ కేసులు పెట్టడం, ఇబ్బందులు కలిగించడం వలన మమ్మల్ని భయపెట్టలేరని అన్నారు. తాము అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రెట్టింపుగా బాధపడవలసి ఉంటుందని హెచ్చరించారు.

గౌరవం గుర్తింపు ఇచ్చే బిఆర్ఎస్ పార్టీలోకి గతంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వారంతా మళ్లీ బి ఆర్ ఎస్ పార్టీలోకి రావాలని మాజీ ఎమ్మెల్యే షిండే ఆహ్వానించారు. ఇతర పార్టీల నుండి బిఆర్ఎస్ పార్టీలో చేరిక సమావేశంలో బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బన్సీ పటేల్, పార్టీ ప్రధాన కార్యదర్శి గోవింద్ పటేల్, మద్నూర్ సింగిల్ విండో మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మద్నూర్ గ్రామ మాజీ సర్పంచ్ సురేష్, ఆ పార్టీ సీనియర్ నాయకులు సోమూరు గ్రామ మాజీ సర్పంచ్ కాశీనాథ్ పటేల్, మిర్జాపూర్ హనుమాన్ టెంపుల్ మాజీ చైర్మన్ నరసింహులు గౌడ్, శాఖాపూర్ మాజీ సర్పంచులు ఎంకే పటేల్, మహమ్మద్, పార్టీ నాయకులు మాజీ సర్పంచులు మాజీ ఎంపిటిసిలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad