బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి  చేరికలు

నవతెలంగాణ- కమ్మర్ పల్లి: మండలంలోని నాగాపూర్ గ్రామానికి చెందిన యువకులు బుధవారం ఉపసర్పంచ్  కప్పదండి అశోక్ ఆధ్వర్యంలో  ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.గ్రామానికి చెందిన మహేష్, హరీష్, మల్లేష్, మారుతి, హరీష్, తదితరులు కాంగ్రెస్ పార్టీ కండువాను కప్పుకున్నారు. రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, నియోజకవర్గంలో ముత్యాల సునీల్ కుమార్ గెలుపు తధ్యమన్నారు.ఆ గెలుపులో తాము కూడా భాగస్వామ్యం కావాలని, ముత్యాల సునీల్ కుమార్ గెలుపు కొరకు పని చేయాలని నిర్ణయించుకొని కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు వారు తెలిపారు. అనంతరం ముత్యాల సునీల్ కుమార్  మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అమలు చేయబోయే ఆరు గ్యారెంటీలను ప్రజలలోకి తీసుకెళ్లి అవగాహన కల్పించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసేలా చేయాలని వారిని కోరారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరుల  పాల్గొన్నారు.
Spread the love