- Advertisement -
నవతెలంగాణ – భీంగల్
భీంగల్ మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు కర్నె సత్యగంగయ్య ఈరోజు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలొ చేరారు. ఈ క్రమంలో ముత్యాల సునీల్ కుమార్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న మంచి పనులకు ఆకర్షితులై, భీంగల్ మున్సిపల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేలా కృషి చేస్తామని పార్టీలో చేరామని అన్నారు. మున్సిపల్ ఎన్నికలలొ కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని ముత్యాల సునీల్ కుమార్ సూచించారు.
- Advertisement -



