నవతెలంగాణ -తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కీర్తిశేషులు జంగా సాయి రెడ్డి గారి కుటుంబం మొత్తం, మేడారం బిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు గండికోట నారాయణ, యువజన నాయకులు జంగా వెంకటేష్ రెడ్డి, బిసి సెల్ ఉపాధ్యక్షులు ఆలకుంట కృష్ణ, యూనియన్ నాయకులు జంగా సంతోష్ రెడ్డి, నిండు వినోద నారబోయిన రమేష్, నాగ చారి, అక్కినపల్లి వీరాచారి లు సీతక్క సమక్షంలో మంగళవారం తాడ్వాయి మండల కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో రేషన్ కార్డుల పంపిణీ అనంతరం, మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ సహాయ సహకారాలు అందిస్తానని, పార్టీ బలోపేతానికి ప్రధాన లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొల్లు దేవేందర్, గౌరవాధ్యక్షులు జాలపు అనంతరెడ్డి, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు పులి సంపత్ గౌడ్, మాజీ ఎంపిటిసి బత్తిని రాజు గౌడ్, ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES