Saturday, July 19, 2025
E-PAPER
Homeఆదిలాబాద్21న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బంద్ కు పిలుపు

21న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బంద్ కు పిలుపు

- Advertisement -

నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 49ని రద్దు చేయాలని కోరుతూ.. ఆదివాసి ప్రజాస్వామ్య సంఘలు తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జూలై 21వ తేదీన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బంద్‌కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్ కు  సహకరించాలని తుడుం దెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి వేట్టి మనోజ్ తెలిపారు. గురువారం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఆదివాసీల హక్కులకు భంగం కలిగించే జీవో 49 ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి సమస్య తీవ్రతను తెలియజేయడానికి ఈ బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

కావున, ఉమ్మడి జిల్లాలోని అదివాసి ప్రజాలు, గ్రామ పటేల్స్, రాయిసేంటర్ సార్మేడీలు, ఆదివాసి కుల సంఘాలు, ఉమ్మడి జిల్లా ప్రజలు, వ్యాపార, వాణిజ్య సంస్థల యజమానులు, చిరువ్యాపారులు విద్యాసంస్థలు, రవాణా రంగంవారు ప్రజా సంఘలు విద్య వంతులు బుద్దిజీవులు మానవతవాదులు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘలు  విద్యార్థులు యవజన సంఘ నాయకులు, మేధావులు కార్మికులు కర్షకులు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ఈ బంద్‌కు సహకరించి జయప్రదం చేయాలని అన్నారు. సమావేశంలోడివిజన్ ఉపాధ్యక్షులు ఆత్రం గణపతి, నాయకులు వేడ్మ ముకుంద్ రావు, పుస్నక నాగోరావ్, గేడం అనంద్ రావు, దృవా జుగదిరావు, ఆత్రం మచందర్ ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -