నవతెలంగాణ – కల్వకుర్తి టౌన్
ఈనెల 7 నుంచి 9 వరకు పెద్దపల్లి జిల్లాలో జరిగిన స్టేట్ మీట్ 58వ సీనియర్ పురుషుల, మహిళల ఖోఖో ఛాంపియన్షిప్ అంతర్ జిల్లాల క్రీడల్లో పాల్గొన్న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మహిళల జట్టు ఆదివారం బ్రాంజ్ మెడల్ ను కైవసం చేసుకుంది. ఖోఖో స్టేట్ బెస్ట్ డిపెండర్ అవార్డును కల్వకుర్తి ప్రాంత ముద్దుబిడ్డ లహరి సాధించింది. ఈ సందర్భంగా మూడు రోజులపాటు జరిగిన క్రీడల్లో హోరా హోరిలో పాల్గొని జిల్లాకు, కల్వకుర్తి ప్రాంతానికి గుర్తింపు తెచ్చిన క్రీడాకారులకు పలువురు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సెక్రెటరీ, స్టేట్ ఖోఖో అసోసియేషన్ ట్రెజరర్ విలియం, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఖోఖోఅసోసియేషన్ ట్రెజరర్ మధు కుమార్ ఆర్గనైజర్ గోకమళ్ళ రాజు పీడీలు పురణ్ చంద్, ప్రకాష్, జగన్, రూప కోచ్ లు మేనేజర్ లు బాల్ రాజ్, శ్రీశైలం, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
బ్రాంచ్ మెడల్ ను కైవసం చేసుకున్న ఉమ్మడి మహబూబ్ నగర్ మహిళల ఖోఖో జట్టు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



