Saturday, September 27, 2025
E-PAPER
Homeఆటలుజొనాథన్‌ పసిడి గురి

జొనాథన్‌ పసిడి గురి

- Advertisement -

జూనియర్‌ షఉటింగ్‌ ప్రపంచకప్‌

ఢిల్లీ: ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ జూనియర్‌ ప్రపంచకప్‌లో రెండో రోజూ భారత్‌ పతకాల వేట సాగించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో 16 ఏండ్ల కుర్రాడు జొనాథన్‌ గావిన్‌ అంథోని స్వర్ణం సాధించాడు. అర్హత రౌండ్‌లో అగ్రస్థానంలో నిలిచిన జొనాథన్‌.. 244.8 పాయింట్లతో పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ ఈవెంట్‌లో భారత్‌కు ఇది రెండో స్వర్ణ పతకం. 24 రౌండ్లలో అతడు ఏకంగా 21 రౌండ్లలో పది పాయింట్లు సాధించాడు. ఇటలీకి చెందిన లుకా అరిఘి (236.3) రజతం గెలుచుకోగా, స్పెయిన్‌ షఉటర్‌ లుకాస్‌ సాంచెజ్‌ (215.1) కాంస్యం సాధించాడు. జూనియర్‌ ఉమెన్స్‌ 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌లో భారత అమ్మాయి రష్మిక సెహ్గల్‌ (236.1) రెండో స్థానంలో నిలిచి సిల్వర్‌ నెగ్గింది. తటస్థ క్రీడాకారిణి ఎవ్లీనా షీనా (240.9) పసిడి నెగ్గగా.. ఇరాన్‌ షఉటర్‌ షెకారి (213.8) కాంస్యం నెగ్గింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -