- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
నందిపేట్ మండల కేంద్రానికి అనుకొని ఉన్న జోరుపూర్ గ్రామ ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరింది. ప్రాథమిక పాఠశాలలో ఒకటవ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉంది. ఇందులో సుమారు 25 మంది విద్యార్థులు చదువుతున్నారు.. కేవలం ఒకే గది ఉండడంతో విద్యార్థులకు ఇబ్బంది పడుతున్నారు.. గదిలో పైపెచ్చు ఉడిపడడంతో విద్యార్థులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. గోడలు కూడా పగలు వచ్చాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలతో తీవ్ర భయాందోళన చెందుతున్నారు .ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు ,విద్యార్థులు వేడుకుంటున్నారు.
- Advertisement -