Thursday, May 15, 2025
Homeఆటలుగుజరాత్ స్టార్ బ్యాటర్ దూరం..

గుజరాత్ స్టార్ బ్యాటర్ దూరం..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: భారత్, పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) యజమాన్యాలకు ఇబ్బందిగా మారాయి. పాక్, భారత్ మధ్య యుద్ధ భయంతో ఐపీఎల్‎ ను బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణగడంతో 2025, మే 17 నుంచి తిరిగి క్యాష్ రిచ్ లీగ్ కు పునః ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గుజరాత్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ ఐపీఎల్ ప్లే ఆఫ్స్‎కు అందుబాటులో ఉండటం లేదు. ఈ నెల (మే) 29 నుంచి ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య వైట్ బాల్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‎కు జోస్ బట్లర్ ఎంపికయ్యాడు. దీంతో అతడు ఐపీఎల్ ఫ్లే ఆఫ్స్‎కు దూరం కానున్నాడు. కీలకమైన ప్లే ఆఫ్స్‎కు బట్లర్ దూరం కానుండటంతో అతడి ప్రత్యామ్నాయంపై గుజరాత్ టైటాన్స్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే బట్లర్ స్థానాన్ని శ్రీలంక స్టార్ బ్యాటర్ కుశాల్ మెండిస్‎తో భర్తీ చేసింది జీటీ. కుశాల్ మెండిస్‎తో అగ్రిమెంట్ చేసుకున్నట్లు గురువారం (మే 15) అఫిషియల్‎గా అనౌన్స్ చేసింది. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -