బీఆర్‌ఎస్‌లో జోష్‌

– కాంగ్రెస్‌ అసమ్మతి నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరిక
– టీఆర్‌ఎస్‌ కు పెరుగుతున్న ప్రజా ఆదరణ
– తమ సత్తా చాటుతామంటున్న మాజీ కాంగ్రెస్‌ నాయకులు
అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ లో అనేకమంది కాంగ్రెస్‌ నాయకులు చేరుతున్నారు. కాంగ్రెస్‌ లో టికేట్‌ ఆశ్రించి బంగపడ్డ సీనియర్‌ నాయకులు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు సైతం అధికార పక్షం వైపు వలస బాటపడుతున్నారు. ముఖ్యంగా 30 సంవత్సరాలు రాజకీయ జీవితం గడిపిన నాయకులు మంత్రులు సైతం కాంగ్రెస్‌ పార్టీని వీడుతున్నారు. మాజీ మంత్రి నాగం జనార్దన్‌ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్‌ కాంగ్రెస్‌ నాయకులు ప్రదీప్‌ కుమార్‌ గౌడ తదితరులు అధికార పార్టీలో చేరి కాంగ్రెస్‌ ను ఓడించడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. తమకు అవకాశం లేకుండా చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ గెలువనివ్వమని శపథం చేస్తున్నారు.
నవ తెలంగాణ – మహబూబ్‌ నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
నాగర్‌ కర్నూల్‌, మహబూబ్‌నగర్‌, గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాలో పరిధిలోవివిధ పార్టీల నుంచి పలువురు గత 15 రోజులుగా ఎమ్మెల్యేలు పార్టీ క్యాంపు కార్యాలములో బీఆర్‌ఎస్‌ లో చేరుతున్నారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నారు. ప్రధానంగా నాగర్‌ కర్నూల్‌ ఎమ్మెల్యేగా టికెట్‌ రచించిన సీనియర్‌ నాయకులు మాజీ మంత్రి నాగం జనార్దన్‌ రెడ్డికి అవకాశం ఇవ్వలేదు. దీంతో ఆయన బీఆర్‌ ఎస్‌ పార్టీలో చేరిపోయారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌ అభ్యర్థి కూచికుల్ల రాజేష్‌ రెడ్డి ఓడించి తీరుదామని శపథం చేస్తున్నారు. జడ్చర్ల టికెట్‌ ఆశించిన ఎర్రశేఖర్‌ భంగపడ్డాడు. అక్కడ అనిరుద్‌ రెడ్డికి టికెట్‌ ఇచ్చారు. దీంతో ఎర్రశేఖర్‌ కాంగ్రెస్‌ నుంచి బీఆర్‌ఎస్‌ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి ఓడించడానికి నియోజకవర్గం మొత్తం కలియ తిరుగుతున్నారు. దేవరకద్ర నుంచి ప్రదీప్‌ కుమార్‌ గౌడ్‌, కాంగ్రెస్‌ నుండి పోటీ చేస్తానని ప్రచారం చేసుకున్నారు. అయితే ఇక్కడి నుండి డిసిసి అధ్యక్షులు జి మధుసూదన్‌ రెడ్డికి అవకాశం కల్పించడంతో ఆయన మనస్థాపానికి గురయ్యారు. జిల్లా కార్యాలయాన్ని విధ్వంసం చేశారు. అక్కడితో ఆగకుండా పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌ అభ్యర్థిని ఓడిస్తానని చెబుతున్నారు. మహబూబ్‌ నగర్‌లోనూ స్థానికులను కాదని మాజీ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్‌ రెడ్డికి టికెట్‌ ఖరారు చేశారు. దీంతో స్థానిక నాయకులు సంజీవ్‌ ముదిరాజ్‌ ఎన్పీ వెంకటేష్‌ ఊబేదుల్లా కోత్వాల్‌ పార్టీ పట్ల అంటి ముట్టనట్టుగా వ్యవహ రిస్తున్నారు. నారాయణపేట లోను మాజీ డిసిసి అధ్యక్షులు శివకుమార్‌ రెడ్డిని కాదని వెంకటేశ్వర్‌ రెడ్డి కూతురు పర్మికా రెడ్డికి అవకాశం కల్పించారు. గద్వాల లోను ఇదే పరిస్థితి నెలకొంది. డీసీసీ అధ్యక్షులు పటేల్‌ ప్రభాకర్‌ రెడ్డిని కాదని అక్కడ జెడ్పి చైర్‌ పర్సన్‌ సరితా తిరుపతయ్యకు అవకాశం కల్పించారు. కాంగ్రెసులో ఉండి టికెట్‌ ఆ షించిన వారంతా తిరిగి బిఆర్‌ఎస్‌ లో చేరారు. కాంగ్రెస్‌ అభ్యర్థులను ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెబు తున్నారు. రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్‌, రైతుబంధు, రైతుబీమా, ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, మిషన్‌ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ తాగునీటిని అందిస్తూ దేశంలోనే ఆదర్శవంతమైన పాలనను సీఎం కేసీఆర్‌ అందిస్తున్నారని ప్రచారం చేసు కుంటున్నారు. సీఎం కేసీఆర్‌ చేస్తున్న అభివద్ధిని చూసి ప్రజలు స్వచ్ఛందంగా బీఆర్‌ ఏస్‌ లో చేరుతున్నారని చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతారని ఆశాభావం వ్యక్తం వ్యక్తం చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కల్వకుర్తి వనపర్తి దేవరకద్ర నారాయణపేట గద్వాల దేవరకద్ర తదితరు నియోజకవర్గాలు భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమంటున్నారు.
ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల పైనే భారం
కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను తమ వైపు తిప్పుకోవడానికి విష్ణు ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా నిరుద్యోగులు మహిళలు విద్యార్థులు దళిత బంధువులకు సంక్షేమ పథకాలు అందరివారు రాష్ట్ర ప్రభుత్వంపై అసహనం తో ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉంచడంలో కాంగ్రెస్‌ విఫలం చెందుతోంది. సీట్లు రానివారు కాంగ్రెస్‌ కు దూరమై టిఆర్‌ఎస్‌ గెలుపుకు మార్గం సుగమము అయ్యింది.

Spread the love