మన పగళ్ల కోసం జర్నలిస్ట్ గుండె మీద
రాత్రంతా కలం వెలుగుతూనే వుంటుంది
రోజూ యుద్ధనౌక మీద శాంతి యాత్ర!
కాలం కత్తి మెడమీద వేలాడుతున్నా
కాగితం మీదికి పరిగెత్తే ప్రతి అక్షరానికి
తెగింపుతో ప్రాణ ప్రతిష్ట చేసే హీరో జర్నలిస్ట్!
సృజనకో పేజీ కేటాయించి
ఒకటి రెండు కొత్త మాటలు కాయిన్ చేసి
అక్కడక్కడా కవిత్వమై ప్రవహించి
సినిమాను ముద్దుగా పలకరించి
క్రీడను ప్రోత్సహించి, మార్కెట్‌ను విశ్లేషించి
భక్తిని, రక్తిని, విద్యను, వైద్యాన్ని – ఆదరించి
కార్టూన్‌తో గుండె బరువు దించుతాడు
గంజాయి మత్తులో డ్రైవర్ యాక్సిడెంట్ చేసినా
ముసలి తల్లిదండ్రులు రోడ్డు పాలైనా
ఆ బాధితుల న్యాయవాది మన జర్నలిస్టే
హత్యాచారానికి గురైన ఆడపిల్ల పక్షాన
మొదటి పేజీ హెడ్డింగ్ అవుతాడు.
బడుగుజీవుల హక్కుల కోసం
సంపాదకీయమవుతాడు
రాజకీయ కుతంత్రాలను
ఎడిట్ పేఈలో ఎండగడతాడు.
ఉగ్రదాడిని పదునెక్కిన అక్షరాలతో ఖండిస్తాడు.
చిన్న శీర్షికలను సరిచేసి
పతాక శీర్షికలను పైకిలేపి
ఆఖరి నిమిషంలో వచ్చిన విషాదవార్తను
విశాల హృదయంతో బాక్సుకట్టి వేస్తాడు.
వందల పేజీల వార్తలు వండివార్చి వడ్డించినా
ఎక్కడా జర్నలిస్ట్ పేరుండదు!
పిచ్చికుక్కలు వెంటాడే ముదురురాత్రి
ఎక్కడో వున్న అద్దిలు చేరుకుంటాడు
జామెక్కిన తర్వాత లేచి మిధ్యా మధ్యాహ్నపు
నిరుదకళ్లతో చేస్తే ఏముంది?
‘ఏ ఫర్ యాపిల్’ తోటల్లో పిల్లలు
సంసారం గళ్ల నుడికట్టును
పూరించే పనిలో ఇల్లాలు
అనిశ్చితి, అశాంతి కలవరపెడుతుండగా
తన బతుకూ ఒక వార్తేనని స్ఫురిస్తుంది.
ఆ వార్తకందరని వ్యక్తికి!
అమ్మంగి వేణుగోపాల్, 9441054637
జర్నలిస్ట్
- Advertisement -
- Advertisement -


