- Advertisement -
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కు చెందిన గడ్డం నాగరాజు అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందాడు. నాగరాజు గత 20 ఏళ్ల నుంచి వివిధ పత్రికల్లో, చానల్లో ఆయన పనిచేశారు. ప్రస్తుతం వార్తా దినపత్రికలో విలేకరిగా పనిచేస్తున్నాడు. గత కొద్ది రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాదులోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుది శ్వాస విడిచాడు. ఆయన మృతి పట్ల ప్రెస్ క్లబ్ తన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపింది.
- Advertisement -



