– సర్ది చెప్పిన కలెక్టర్
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా కేంద్రంలో మున్సిపల్ కౌంటింగ్ కేంద్రం వద్ద ప్రారంభంలోనే జర్నలిస్టులకు సరైన వసతులు కల్పించకపోవడం, కౌంటింగ్ ప్రారంభమై గంటన్నర గడుస్తున్నా ఓట్లు లెక్కింపు ప్రక్రియపై ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయలేదని, కౌంటింగ్ ఏజంట్లతో పాటు జర్నలిస్టులను కూర్చోబెట్టారని మండిపడ్డారు. పిలిచి పాసులిచ్చి అవమానించారని ఆరోపించారు. పాసులు ఉన్న జర్నలిస్టుల (Journalists)పై ఆంక్షలు విధిస్తూ పోలీసులు అడ్డుకోవడాన్ని తప్పుపట్టారు.
ఫలితాలకు సంబంధించిన డిస్ప్లే ఏర్పాటు చేయలేదని, ఇతరులు చెప్తే ఫలితాలు తెలుసుకునే పరిస్థితి నెలకొందన్నారు. వెంటనే డీపీఆర్వోను సస్పెండ్ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు ఎన్ని గంటలైనా రోడ్డుపై నుంచి కదిలే ప్రసక్తి లేదని భీష్మించారు. దాంతో పోలీసులు జర్నలిస్టులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోవడం లేదు. డిస్ప్లే ఏర్పాటు చేసిన అనంతరం కలెక్టర్ వచ్చి విలేకరులతో మాట్లాడారు.



