- Advertisement -
నవతెలంగాణ- రాయపోల్ : సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావును సీనియర్ జర్నలిస్టులు బండారు సురేంద్ర, కాసాని కుమారస్వామి హైదరాబాద్ కోకాపేటలో ఉన్న క్రిస్ విల్లాలోని ఆయన నివాసంలో శుక్రవారం పరామర్శించారు.ఇటీవల వారి తండ్రి తన్నీరు సత్యనారాయణరావు మరణించగా ఆయన చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. ఎమ్మెల్యే కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఈశ్వర్, వెంకట్ సాయి, శ్రీపాద షణ్ముఖ్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -

 
                                    