Friday, November 21, 2025
E-PAPER
Homeఖమ్మంజర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి 

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి 

- Advertisement -

టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం 
ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని హామీ ఇచ్చిన అడిషనల్ కలెక్టర్ టి.శ్రీనివాసరెడ్డి
నవతెలంగాణ – ఖమ్మం కలెక్టరేట్

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్ పి శ్రీనివాస్ రెడ్డికి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం ఉదయం అడిషనల్ కలెక్టర్ పిన్ రెడ్డి శ్రీనివాసరెడ్డిని టీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధి బృందం కలిసి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పాత పద్ధతిలో ఇండ్ల స్థలాలు వచ్చే అవకాశం లేనందున ప్రభుత్వం కొత్త నియమ నిబంధనలు రూపొందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. జిల్లా కేంద్రమైన ఖమ్మంలో గత ప్రభుత్వం స్థలం కేటాయించిందని గుర్తు చేస్తూ కొత్త నిబంధనలతో జిల్లా కేంద్రమైన ఖమ్మంతో పాటు అన్ని నియోజకవర్గ, మండల కేంద్రాల్లో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు.

ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హెల్త్ కార్డులు హైదరాబాద్ లోని నిమ్స్ మినహా ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులు గౌరవించడం లేదని తెలిపారు. ప్రభుత్వం ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇచ్చేందుకు కొత్త నిబంధనలు రూపొందిస్తున్నందున వాటిని జర్నలిస్టులకూ వర్తింపజేయాలని, కాంట్రిబ్యూషన్ కూడా ప్రభుత్వమే భరించాలని విజ్ఞప్తి చేశారు. ఏడాదిన్నరగా పాత అక్రిడిటేషన్లకే స్టిక్కర్లు వేసి కొనసాగిస్తున్నారని దీంతో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల్ని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా అక్రిడిటేషన్ల కమిటీలు ఏర్పాటు చేసి వెంటనే అర్హులైన జర్నలిస్టులందరికీ కొత్తగా అక్రిడిటేషన్లను అందించాలని కోరారు.

జర్నలిస్టులపై దాడులను అరికట్టేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో పోలీసు, రెవెన్యూ, సమాచార, జీఎడి శాఖలతో కలిపి హైపవర్ కమిటీలను నియమించాలని కోరారు. కార్మిక శాఖలో ఉన్న త్రైపాక్షిక కమిటీలను ప్రకటించి సమావేశాలు ఏర్పాటు చేయడం ద్వారా కలం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు పల్లా కొండలరావు, కోశాధికారి తేనె వెంకటేశ్వర్లు, స్టేట్ కౌన్సిల్ సభ్యులు సాతుపాటి రామయ్య, బోయినపల్లి అంజయ్య, నాయకులు కందికొండ శ్రీనివాస్, చేబ్రోలు నారాయణ, కె.శ్రీనివాస్, ఋషి, షేక్ బాజీ షరీఫ్, మందా సత్యానందం, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -