నవతెలంగాణ – జన్నారం : ఎలాంటి నోటీసు లేకుండా విజయవాడలోని సాక్షి ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డి నివాసానికి వెళ్లి భయబ్రాంతులకు గురిచేసిన ఏపీ పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని జన్నారం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చిలువేరు నరసయ్య అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిజాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళుతున్న కారణంగా జర్నలిస్టులను భయపెట్టి అదుపులో పెట్టుకోవాలన్న ఏకైక లక్ష్యంతో ఏపీ పోలీసులు కార్డన్ సెర్చ్లో భాగంగా బలవంతంగా ఇంట్లో చోరబడి తనిఖీలు చేశారనీ పేర్కొన్నారు. ఆ తనిఖీల్లో ఏమీ లభించలేకపోయినా.. కేవలం రాజకీయ కక్షపూరిత కుట్రలో భాగంగానే సాక్షి ఎడిటర్ ను ఇబ్బంది పెట్టాలన్న వ్యూహంలో భాగంగానే తనిఖీలు చేశారన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని జర్నలిస్టులను, ఎడిటర్లను నియంత్రించుకోవాలనుకోవటం మతిలేని చర్యగా భావిస్తున్నామనీ అన్నారు. తనిఖీలుగా పేరు చెప్పినా అది దాడిగానే భావిస్తున్నామనీ, ఏపీ పోలీసుల తీరుపై అన్ని యూనియన్లు ఖండించాయని అన్నారు. ఏపీలో జర్నలిస్టులపై మొదలైన పోలీస్ వేధింపులను తక్షణమే ఆపకపోతే జాతీయ స్థాయిలో నిరసన కార్యక్రమాలు తప్పవని హెచ్చరించారు. నిరసనలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి లింగన్నగౌడ్, కోశాధికారి చంద్రశేఖర్, ప్రచార కార్యదర్శి జాడి వెంకటయ్య సభ్యులు వేణుగోపాల్, రమేష్, ప్రశాంత్ సత్యం,మహేష్, శివరామకృష్ణ పవన్, శంకర్, నరసయ్య,, సతీష్ తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.
నల్ల బ్యాడ్జీలతో జర్నలిస్టుల నిరసన ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES