Thursday, February 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దేశవ్యాప్త సమ్మెకు జర్నలిస్టుల మద్దతు..

దేశవ్యాప్త సమ్మెకు జర్నలిస్టుల మద్దతు..

- Advertisement -

నవతెలంగాణ – ఆత్మకూరు
దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు ఆత్మకూరు మండల జర్నలిస్టులు సంపూర్ణ మద్దతు తెలపడంతో పాటు గురువారం మండల కేంద్రంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అక్రమంగా తీసుకొచ్చిన నాలుగు నల్ల చట్టాలు అన్ని రంగాల కార్మికులకు మరణశాసనం లాంటివని తీవ్రంగా ఆక్షేపించారు. నాలుగు లేబర్ కోడ్‌లలో జర్నలిస్టుల సంబంధిత హక్కులను హరించి, పాత్రికేయరంగాన్ని నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు.

కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ నల్ల చట్టాలను ఉపసంహరించుకోవాలి అన్ని రంగాల కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు ముదిగిరి ఓదేలు (ప్రజా పక్షం), సయ్యద్ వలి (నవతెలంగాణ), వీర్ల విద్యసాగర్ (ఆంధ్ర ప్రభ), సముద్రాల సురేష్ (ఘంటారావం), వంగేటి ప్రభాకర్ (దిశ), అర్షం మధు (వార్త), పెరుమాండ్ల శ్రీనివాస్ (సూర్య), బోడ్డు రాజేందర్ (వాస్తవం), కందకట్ల రాము (మన ప్రగతి), తనుగుల సంపత్ (కాకతీయ), మథ్థే వెంకటేశ్ (పీ.సి.డబ్లు) తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -