నవతెలంగాణ – కంఠేశ్వర్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ లు కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి తీర్మానించడంపై నిజామాబాద్ జిల్లా బీసీ హక్కుల పరిరక్షణ సంక్షేమ సంఘం అధ్యక్షులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా మాయా వార్ రాజేశ్వర్ అధ్యక్షతన బీసీ సంఘ భవనంలో కార్యవర్గ సమావేశం శనివారం నిర్వహించారు. సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డికి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
బీసీ సంబంధిత చట్ట సవరణకు ఆర్డినెన్సు జారీ చేసి బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకున్నందుకు రాష్ట్ర మంత్రి మండలికి ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలో జిల్లా బీసీ హక్కుల పరిరక్షణ సంక్షేమ సంఘం కార్యవర్గం సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించనైనది. సమావేశంలో ఉపాధ్యక్షులు అశోక్ సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి డి రమేష్ సంయుక్త కార్యదర్శి మహేందర్ గౌడ్ కోశాధికారి పురుషోత్తం దాస్ కార్య నిర్వాహక కార్యదర్శి కే సుదర్శన్ కార్యవర్గ సభ్యులు లక్ష్మణ్ రంజిత్ తదితరులు పాల్గొన్నారు.
బీసీలకు రిజర్వేషన్లు ఆమోదం పట్ల హర్షం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES