నవతెలంగాణ – ముధోల్ : ముధోల్ మండలంలోని బ్రహ్మంన్ గావ్ లిఫ్ట్ ఇరిగేషన్ మరమత్తులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంపై బ్రహ్మంన్ గావ్ మాజీ సర్పంచ్ రామ్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క మా గ్రామానికి పంచాయతి భవన ప్రారంభోత్సవానికి వచ్చినపుడు పెండింగ్ లో ఉన్న బ్రహ్మాంగావ్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు త్వరగా నిధులు మంజూరు చేసి పనులు పూర్తి చేయాలని లిఫ్ట్ ఇరిగేషన్ పాలకవర్గ సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ ,గ్రామస్థులతో పాటు తాను ఈ విషయం ను మంత్రి కి తెలియజేయడం జరిగిందన్నారు. దీంతో మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , దృష్టికి ప్రత్యేకoగా తీసుకెళ్లడంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు , పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ,మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
లిఫ్ట్ ఇరిగేషన్ కు నిధుల మంజూరుపై హర్షం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES