Monday, April 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అభివృద్ధి నిధుల మంజూరుపై హర్షం

అభివృద్ధి నిధుల మంజూరుపై హర్షం

- Advertisement -

మంత్రి శ్రీధర్ బాబుకు రాగం ఐలన్న కృతజ్ఞతలు
నవతెలంగాణ – మల్హర్ రావు

మండల అభివృద్ధికి నేషనల్ హైవేస్ అథారిటీ అప్ ఇండియా, హైబ్రిడ్ అన్యుటి మోడ్ పథకం ద్వారా రూ.17.21 కోట్ల నిదులు మంజూరు చేయించిన రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబుకు కాంగ్రెస్ పార్టీ ఓబీసీ నాయకుడు రాగం ఐలయ్య ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మంత్రిని తాడిచెర్ల మానేరు నుండి కిషన్ రావు పల్లె వరకు రూ.2.19 కోట్లతో బిటి రోడ్డు, డివైడర్, సెంట్రల్ లైటింగ్, తాడిచెర్ల నుండి నాగులమ్మ క్రాస్ వరకు రోడ్డు, మల్లారం బ్రిడ్జి మరమ్మత్తు రూ. 15.02 కోట్లు మంజూరు చేయించారని తెలిపారు. ఇందుకు మంత్రి శ్రీధర్ బాబుకు మండల ప్రజల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపినట్లుగా చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -