Saturday, September 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొత్త రేషన్ కార్డుల మంజూరు పట్ల హర్షం

కొత్త రేషన్ కార్డుల మంజూరు పట్ల హర్షం

- Advertisement -

 మంత్రి శ్రీధర్‌బాబుకు కృతజ్ఞతలు: కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు రాజబాపు గౌడ్
నవతెలంగాణ – కాటారం

కాటారం మండల పరిధిలోని బయ్యారం గ్రామపంచాయితీ పరిధి రేషన్‌షాపుకు తాజాగా ప్రభుత్వం అధిక సంఖ్యలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం స్థానిక ప్రజలకు సంతోషాన్ని కలిగించింది. ఈ కార్డుల మంజూరుతో గ్రామ ప్రజలు రేషన్ బియ్యం, ఇతర అవసరమైన వస్తువులు సులభంగా పొందే అవకాశం కలగనుండటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్థులు మాట్లాడుతూ ఇప్పటివరకు రేషన్ బియ్యం లభించక ఇబ్బందులు ఎదుర్కొన్నామని, కొత్త కార్డులు రావడం వల్ల సమస్యలు పరిష్కారమయ్యాయని పేర్కొన్నారు. ముఖ్యంగా బలహీన వర్గాలకు ఈ కార్డులు లభించడం ద్వారా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయమని వారు అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా బయ్యారం కాంగ్రెస్ కమిటీ గ్రామ శాఖ అధ్యక్షుడు జాగిరి రాజబాపు గౌడ్ మాట్లాడుతూ .. 10 సంవత్సరాల క్రితం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం లోనే మంజూరైన రేషన్ కార్డులు తప్ప గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదని, గ్రామ ప్రజల అవసరాలను గుర్తించి, కాటారం మండలం బయ్యారం రేషన్ షాపు పరిధిలో రెండు గ్రామాలలో 101 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడంలో ముఖ్యపాత్ర పోషించిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. వారి సహకారంతో గ్రామ ప్రజలకు పెద్ద ఉపశమనం లభించింది అని తెలిపారు.రేషన్ బియ్యం లభ్యం కావడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొందని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -