- Advertisement -
- నియోజకవర్గంలో మొత్తం ఓట్లు 3,92,669
- సెప్టెంబర్ 17 వరకు అభ్యంతరాల స్వీకరణ
- మార్పులు, చేర్పులతోపాటు కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం
- ఈనెల 25 వరకు ఫిర్యాదులు, అర్జీల పరిష్కారం
- 30న తుది జాబితా విడుదల
నవతెలంగాణ- సిటీబ్యూరో
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఓటరు ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. జూబ్లిహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ముసాయిదా ఓటర్ల జాబితాను భారత ఎన్నికల సంఘం మంగళవారం ప్రచురించింది. జాబితాను అధికారులు నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ ప్రచురించారు. కొత్త ఓటర్ల నమోదుతో పాటు మార్పులు, చేర్పులు చేపట్టేందుకు వెసులు బాటు కల్పించారు. సెప్టెంబర్ 30న తుది ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం జూబ్లిహిల్స్ అసెంబ్లీ నియోజక వర్గంలో 139 లొకేషన్‌లు.. 407 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 3,92,669 మంది ఓటర్లున్నారు. పురుష ఓటర్లు 2,04,288 మంది కాగా, మహిళా ఓటర్లు 1,88,356 మంది, ఇతరులు 25 మంది ఉన్నారు.
సెప్టెంబర్ 17 వరకు అభ్యంతరాల స్వీకరణ
నియోజకవర్గానికి చెందిన డ్రాఫ్ట్ ఫొటో ఓటర్ల జాబితా కాపీని సంబంధిత ‘ఇఆర్‌వో’ కార్యా లయంలో, పోలింగ్ స్టేషన్‌లలో అందుబాటులో ఉంచారు. ఓటర్లు తమ పేర్లను ధ్రువీకరించు కోవడానికి వీలుగా ‘సీఇఓ’ వెబ్‌సైట్ షషష.షవశ్‌ీవశ్రీaఅస్త్రaఅa.అఱష.ఱఅలో తెలుసుకోవచ్చు. ‘ఇసీఐ’ వెబ్‌సైట్ ‘ఙశ్‌ీవతీర.వషఱ.స్త్రశీఙ.ఱఅ’ లేదా ‘జజుఉ’ వెబ్‌సైట్ షషష.షవశ్‌ీవశ్రీaఅస్త్రaఅa.అఱష.ఱఅలో అందుబాటులో ఉంచారు. ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లను సరిచూసుకోవాలి. అభ్యంతరాలు ఏవైనా ఉంటే, ఫారం-6, ఫారం-7, ఫారం-8లో సమర్పించాలి. ఓటర్ల జాబితాపై ఈనెల 2 నుంచి 17 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. జులై ఒకటో తేదీ నాటికి 18 ఏండ్ల వయస్సు నిండిన వారందరూ సెప్టెంబర్ 17లోగా ఓటర్లుగా నమోదు చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో సైతం ఓటర్లుగా నమోదు చేసుకు నేందుకు అవకాశం కల్పిస్తున్నారు. అంతేకాకుండా ఓటర్ల జాబితాలో తప్పుల సవరణ, మార్పులు, చేర్పులు, మృతుల పేర్ల తొలగింపు, పోలింగ్ కేంద్రాలు, నియోజకవర్గాల మార్పు చేసుకోవాల నుకునే వారు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. సెప్టెంబర్ 25 వరకు ఫిర్యాదులు, అర్జీలు పరిష్కరించి, సెప్టెంబర్ 30న తుది ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు.
- Advertisement -