నవతెలంగాణ – కంఠేశ్వర్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోటవరంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవీఎన్ భరత లక్ష్మి ఇటీవల విడుదలైన పదవ తరగతి ఫలితాలలో అత్యుత్తమ స్టేట్ బెస్ట్ మార్క్లు 596/600 సాధించిన ఎస్. కృతిని శనివారం అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లా కుుు చెందిన విద్యార్థిని రాష్ట్రస్థాయి మార్కులు తెచ్చుకొని వారి తల్లిదండ్రులకే కాకుండా జిల్లాకు, రాష్ట్రానికి కూడా కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిందని కొనియాడారు .ఇంతటి కృషికి కారకులైన కే. ఓ. ఎస్ యాజమాన్యాన్ని ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి మాట్లాడుతూ.. కే .ఓ .ఎస్ లో ఉన్నటువంటి ఐఐటి మెడికల్ ఫౌండేషన్ ఎంతో చక్కగా ప్రణాళిక బద్ధంగా శిక్షణ ఇవ్వడం వల్ల, ఎంతటి హార్డ్ క్వశ్చన్ అయినా నేను సులువుగా రాయగలిగాను. అందుకే ఇంతటి మార్కులు వచ్చాయి. ఎలాంటి ఒత్తిడి లేకుండా నేను టెన్త్ ఎగ్జామ్స్ రాశానని, దానికి కారణం కాకతీయ ఒలంపియాడ్ స్కూల్ నాకు ఎంతగానో దోహదపడింది అని విద్యార్థిని కృతి తెలియజేసింది. కే. ఓ. ఎస్ డైరెక్టర్ సిహెచ్. రామోజీరావు మాట్లాడుతూ.. విద్యార్థులు తమ ప్రతిభను గుర్తించే విధంగా విద్యా ప్రణాళికలు కాకతీయ ఒలంపియాడ్ స్కూల్ లో ఉంటాయని, ఇవన్నీ ఐఐటి మెడికల్ ఫౌండేషన్ ద్వారానే సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి తండ్రి డాక్టర్ కృష్ణ మాట్లాడుతూ.. కే ఓ ఎస్ లో చేర్పించిన నాటినుండి స్కూల్ కరికులం ద్వారా ఎప్పటికప్పుడు వచ్చిన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ ఉపాధ్యాయులు మరియు డైరెక్టర్లు ఇచ్చినటువంటి ప్రణాళికల్ని తూచా తప్పకుండా పాటిస్తూ పాప ప్రిపేర్ అయ్యేది. మేము ఇద్దరం డాక్టర్స్ అవడం వల్ల పాపతో ఎక్కువగా టైం స్పెండ్ చేసే వాళ్ళం కాదు. అయినప్పటికీ కె ఓ ఎస్ విద్యా ప్రణాళికలు మా పాపకి ఎంతో దోహదపడ్డాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి భాస్కర రావు, వివిధ జ్యుడిషరీ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు.
విద్యార్థిని కృతిని అభినందించిన జడ్జి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES