నవతెలంగాణ – మద్నూర్
జుక్కల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వెన్నంటూ అండగా ఉంటానని జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు హామీ ఇచ్చారు. జుక్కల్ నియోజకవర్గం స్థాయి కార్యకర్తల సమావేశం డోంగ్లి మండలంలోని కుర్లా యనబోరా గ్రామ శివారు పరిధిలోగల రాచేశ్వర్ ఆలయం ఆవరణంలో బుధవారం సాయంత్రం నిర్వహించారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి పరిశీలిఖులుగా సత్యనారాయణ గౌడ్ గోపాల్ యాదవ్ హాజరుకాగా వీరితో పాటు జిల్లా పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే అధ్యక్షతన నిర్వహించగా నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలైన డోంగ్లి, మద్నూర్, బిచ్కుంద, జుక్కల్, పెద్ద కోడప్గల్ ,పిట్లం ,నిజాంసాగర్ , మహమ్మద్ నగర్, మండలాల పార్టీ అధ్యక్షులు యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొనగా.. ఈ సమావేశానికి పరిశీలకులుగా వచ్చిన సత్యనారాయణ గౌడ్, గోపాల్ యాదవ్, జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర పార్టీ ఐ కమాండ్ ఆదేశాల మేరకు నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసి రాబోయే కాలంలో పార్టీ బలోపేతానికి గ్రామస్థాయి మండల స్థాయి నూతన కమిటీల ఏర్పాటు రాబోయే స్థానిక సంస్థలు ఎన్నికల్లో పార్టీ నాయకులు గెలుపే లక్ష్యంగా సమావేశాల నిర్వహణ కొనసాగుతుందని వారు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గడిచిన 15 సంవత్సరాలు పార్టీకి పనిచేసిన నాయకులు కార్యకర్తలు ఎన్నో రకాలుగా ఒడిదొడుకులు ఎదుర్కొన్నారని పార్టీ కోసం కట్టుబడి పనిచేసిన ప్రతి ఒక్కరికి నూతన కమిటీల ఎంపికలో గుర్తింపు ఉంటుందని ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఆదుకుంటానని హామీ ఇచ్చారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే సహించనని పార్టీ తల్లి లాంటిదని పార్టీకి కట్టుబడి పని చెయ్యాలని కార్యకర్తలకు నాయకులకు హితవు పలికారు. హై కమాండ్ ఆదేశాల మేరకు జుక్కల్ నియోజకవర్గం లో క్రమశిక్షణగా పార్టీ బలోపేతానికి అండగా ఉంటానని గ్రామ కమిటీలు మండల కమిటీలు ఏర్పాటు విషయంలో పార్టీని నమ్ముకున్న వారికి పదవులు లభిస్తాయని తెలిపారు. ఎమ్మెల్యే పనితీరుపై పరిశీలకులుగా వచ్చిన సత్యనారాయణ గౌడ్ గోపాల్ యాదవ్ అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ అభినందించారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల నుండి ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
కార్యకర్తలకు వెన్నంటూ అండగా ఉంటా జుక్కల్ ఎమ్మెల్యే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES