– అంత్యక్రియలో పాల్గొని పాడేమోసిన మాజీ ఎమ్మెల్యే..
నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలం మాజీ జడ్పీటీసీ మాధవ రావు దేశాయ్ గారి మాతృమూర్తి సోమవారం రోజున మరణించారు. ఇట్టి విషయం తెలుసుకున్న జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే షెడ్యూల్ కార్యక్రమాలను వాయిదా వేసుకుని జుక్కల్ మండలం పెద్ద గుల్ల గ్రామంలో అంతిమయాత్రలో పాల్గొన్నారు. మాధవ రావు దేశాయి గారి మాతృ మూర్తి అంత్యక్రియలో పాల్గొని జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే వాడే మోశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తన స్నేహితుడైన మాధవ దేశాయ్ మాతృమూర్తి అనారోగ్యంతో ఉండడంతో ఈరోజు మరణించడం జరిగింది. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మాతృమూర్తి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
జుక్కల్ మాజీ జెడ్పీటీసీ మాధవరావు దీక్ష మాతృమూర్తి మాతృవియోగం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES