Tuesday, December 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యోగాలో రాష్ట్రస్థాయి మొదటి ర్యాంకు సాధించిన జుక్కల్ వాసి

యోగాలో రాష్ట్రస్థాయి మొదటి ర్యాంకు సాధించిన జుక్కల్ వాసి

- Advertisement -

– రాష్ట్రస్థాయిలో గోల్డ్ మెడల్
– నేషనల్ స్థాయికి ఎంపిక
నవతెలంగాణ – జుక్కల్ 

మట్టిలో మాణిక్యాలు అటే ఇదేనేమో అనే విధంగా ఉంది. కామారెడ్డి జిల్లా,  జుక్కల్ మండలంలోమారు మూల మండలంలో నిరుపేద రైతు కుటుంబంలో జన్మించి రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతంగా గుర్తించిన జుక్కల్ నివాసిని అయిన గొల్ల అకీరా చిన్ననాటి నుండి యోగాలో ఆసక్తి చూయించింది. తల్లి, తండ్రీ , కూతురు క్షేమం గురించి ఆలోచించి జుక్కల్ మండల కేంద్రంలో పాథలాజికల్ ల్యాబ్ నిర్వహించేవారు. వ్యాపారాలు సరిగా నడవకపోవడంతో తండ్రి తన కూతురు భవిష్యత్తును ఆలోచించారు. అనంతరం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోపాథలజికల్ ల్యాబ్ నిర్వహించేందుకు జిల్లా కేంద్రంలో స్థిరపడ్డారు.  విశ్వ వికాస్ , నిజామాబాద్ ప్రైవేట్ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారు. 

చిన్నారి తాను చదువుతున్న పాఠశాలలోని యోగ గురువు ఆధ్వర్యంలో మెలుకువలు సాధించి జిల్లా మరియు రాష్ట్రస్థాయి ఆదియోగి పరమేశ్వర డోగా 4వ ఫౌండేషన్ తెలంగాణ రాష్ట్రస్థాయి నాల్గవ యోగ పోటీలు అండర్ టెన్ విభాగం 2025 వ  కాంపిటీషన్ పోటీలో పాల్గొని రాష్ట్రస్థాయి లో మెరిట్ సాధించి  మొదటి స్థానం పొంది అథ్లెట్ యోగాసన స్పోర్ట్స్ ఫెడరేషన్ తెలంగాణ ఏ వై పి వై ఎఫ్ నిర్వహించిన గ్లోబల్ ఇండియా యోగ తెరపిస్ట్ అసోసియేషన్ తెలంగాణ చాప్టర్ యోగ పోటీలు మరియు కార్యకలాపాలు వేదిక భాష్యం బ్లూమ్స్ పాఠశాల మణికొండ బ్రాంచ్ హైదరాబాద్ లో తేదీ 12 -10- 2025  బంగారు పతకం సాధించారు. అనంతరం జాతి స్థాయిలో నిర్వహించే యోగాసనం పోటీ  కలకత్తాలో నిర్వహిస్తున్నారు. దీక్షిస్తాయిలో పాల్గొనేందుకు చిన్నారి అకిరా కు అవకాశం లభించింది.

ఈ విషయం జుక్కల్ ప్రాంతవాసులకు చాలా శుభదాయకంగా చెప్పవచ్చు. మట్టిలో మాణిక్యాలు ఉంటాయని పెద్దలు అంటూ ఉంటారు. అటువంటి సంఘటన జుక్కల్ మారుమూల ప్రాంతంలో పుట్టిన బిడ్డకు రాష్ట్రస్థాయిలో  ఈ బంగారు పతకం  సాధించడం జుక్కల్ ప్రాంతవాసులు సంతోషంలో ఉన్నారు. ఇటీవలే రాష్ట్రస్థాయిలో బంగారు పతకం సాధించిన శుభ సందర్భంగా దేశ స్థాయిలో నీ యోగ పోటీలో పాల్గొనేందుకు డిసెంబర్ 26వ , 27వ తేదీన కలకత్తాలో నిర్వహించే పోటీలో పాల్గొననున్నారు. తండ్రి తాను నిర్వహిస్తున్న పాథాలజీ ల్యాబ్ ను జిల్లా కేంద్రంలోకి మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రస్తుతం జుక్కల్ ప్రాంతవాసులు చిన్నారి అకిర జాతీయస్థాయిలో ఉత్తమ ఫలితం సాధించి బంగారు పథకాన్ని సాధించాలని మండల వాసులు దేవుని ప్రార్థిస్తున్నారు.

అక్కడినుండి ఇంటర్నేషనల్ స్థాయిలో యోగ కార్యక్రమంలో పాల్గొని పలు పథకాలు సాధించాలని జుక్కల్ మండల ప్రాంతవాసులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. ప్రాంత ప్రజల కొరకు చిన్నారి నిత్యం కష్టపడుతూ బుధవారం నాడు నిజామాబాద్ నుండి కలకత్తాకు బయలుదేరుతున్న సందర్భంగా పలువురు అభినందించి శుభాకాంక్షలు చిన్నారికి మొబైల్ ద్వారా సమాచారం తెలియజేశారు. చిన్నారి అకీరా దేశ స్థాయిలో బంగారు పతకం సాధిస్తే జుక్కల్ ప్రాంతంలో ప్రజలు సంబరాలు నిర్వహించేందుకు సన్నాహాల ఏర్పాట్లను చేసుకుంటున్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -