- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలం మేజర్ గ్రామపంచాయతీ గ్రామ ఉప సర్చంచ్ షేక్ ఫిర్దొస్ (ఉప సర్పంచ్),రియాజ్, జమిల్, ఫరూఖ్, కరీం, రఫిక్, షేక్ జునిద్, మోషిన్,ఇబ్రహీం, రాజు పటేల్ అజ్మీర్ ను సందర్శించారు. జుక్కల్ గ్రామ ఉప సర్పంచ్, గ్రామ యువకులు జుక్కల్ గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, పంటలు బాగా పండాలని కోరుకున్నట్టు ఉప సర్పంచ్ తెలిపారు. ఈ సందర్భంగా గత రెండు రోజుల క్రితం అజ్మీర్ కు బయలుదేరిన జుక్కల్ ఉపసర్పంచ్ బృందం అల్లాహ్ దర్శనానికి చేరుకుని మొక్కులు తీర్చుకున్నామని వెల్లడించారు. అజ్మీర్ దర్గా దర్శనార్థం అనంతరం అక్కడ పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మిత్ర బృందం తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



