నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ నియోజకవర్గం తాజా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే జుక్కల్ మండల కేంద్రంలో అలై బలై కార్యక్రమాలు ఆయా పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల ముఖ్య కార్యకర్తలు, నాయకులు, తదితరులు తమ నాయకుని కలిసి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ అలైబలయి కార్యక్రమంలో పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఆర్యవైశ్య సంఘం కార్యాలయంలో నాయకులతో వారు వారి సంబంధిత కార్యాలయాలయంలో సమావేశాలు నిర్వహించినారు. కార్యకర్తలకు నాయకులకు రాబోయే ఎన్నికల గురించి దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని కాంగ్రెస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు, ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
