Saturday, November 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జూనియర్ అసిస్టెంట్ సేవలు మరువలేనివి

జూనియర్ అసిస్టెంట్ సేవలు మరువలేనివి

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్  : తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న షేక్ షబ్బీర్ సేవలు మరువలేనివని  సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా, తహసిల్దార్ సత్యనారాయణ లు అన్నారు.  పట్టణ శివారులోని ప్లాజా గార్డెన్ లో  శుక్రవారం రాత్రి ఉద్యోగ విరమణ” సన్మానోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ తహసీల్దార్ సత్యనారాయణ సభాధ్యక్షత  వహించగా సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా ముఖ్యఅతిథిగా ఏసీపి వెంకటేశ్వర్ రెడ్డి సీఐ సత్యనారాయణ లు విశిష్ట అతిథులుగా, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ వినోద్, డిప్యూటీ తహసీల్దార్ సుజాత, నందిపేట్ రిటైర్డ్ తహసీల్దార్ గోపు మోహన్ లు గౌరవ అతిధులుగా పాల్గొని, షేక్ షబ్బీర్, జూనియర్ అసిస్టెంట్ జీవిత విశేషాలతో రిటైర్డ్ టీచర్ జింధం నరహరి రూపొందించిన సన్మాన – ఆనందవల్లి, క్రోనాలజి అనే కరపత్రాన్ని ఆవిష్కరింపజేసి, చదివి వినిపించారు.రెవెన్యూ శాఖలో నందిపేట్, మాక్లూర్, నవీపేట్, మోర్తాడ్, ఆర్మూర్ మండలాలలో విధులు నిర్వహించి 32 సంవత్సరాలుగా చేసిన సేవలను స్లాగిస్తూ అభినందిస్తూ శాలువలతో పూలమాలతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా సభాధ్యక్షులు సత్యనారాయణ ముఖ్య అతిథి  సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా మాట్లాడుతూ.. ప్రజలతో సర్టిఫికెట్లతో ఉన్న సంబంధంతో తహసీల్దార్ కార్యాలయంలో పనిచేయడం చాలా కష్టమైన పని అని, 32 వసంతాలుగా ఎలాంటి రిమార్కులు లేకుండా ప్రజలతో మమేకమై మెప్పించి ఒప్పించే నైపుణ్యం అందరికీ ఉండదని,ఈ అరుదైన ఉద్యోగి సేవలు ఆదర్శమన్నారు. తనకు అంగవైకల్యం ఉన్నా,భార్య అనారోగ్యంతో ఉన్నా బయటికి  కనబడనీయకుండా ఆత్మస్తైర్యమే ఆలంబనగా అంకితభావంతో పనిచేసి అందరి హృదయాలలో చెరగని ముద్ర వేసిన ఆయన సేవలను ప్రజలు మరువలేరన్నారు.సీఐ సత్యనారాయణ, ఏసీపి వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. షేక్ షబ్బీర్ రెవెన్యూ శాఖలో ఎక్కడ పని చేసినా ప్రజల మనిషిగా వారి సర్టిఫికెట్ల సమస్యలపై తగిన సలహాలు సూచనలు ఇచ్చిన గొప్ప ఉద్యోగి, కుటుంబ సమస్యలు ఎన్ని ఉన్నా తనలో దాచుకొని రత్నాల్లాంటి ముగ్గురు కొడుకులతో “ఉద్యోగ విరమణ” వరకు ఏలాంటి రిమార్కులు లేకుండా విధులు నిర్వహించిన షేక్ షబ్బీర్ సేవలు అభినందనీయమన్నారు. ఇలాంటి మంచి ఉద్యోగి రిటైర్ కావడం రెవెన్యూ శాఖకు తీరని లోటన్నారు.ఈ దంపతులు వారి శేష జీవితం ఆనందంగా గడపాలన్నారు. ఈ కార్యక్రమానికి వన్నెల్ (కే) గ్రామ విశ్రాంత ఉపాధ్యాయులు జింధం నరహరి, రేగుల సదానందం సమన్వయకర్తలుగా వ్యవహరించారు.

ఈ కార్యక్రమంలో,మైనార్టీ సోదరులు, మున్సిపల్ కౌన్సిలర్లు,తహసీల్దారు,ఆర్టీవో కార్యాలయాల సిబ్బంది, బంధుమిత్రులు,శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొని, శాలువలు పూలమాలలతో సత్కరించి “ఉద్యోగ విరమణ” సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -