Saturday, June 28, 2025
E-PAPER
Homeసినిమా'జూనియర్‌' టీజర్‌ రిలీజ్‌

‘జూనియర్‌’ టీజర్‌ రిలీజ్‌

- Advertisement -

రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త గాలి జనార్ధన్‌ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి ‘జూనియర్‌’ సినిమాతో హీరోగా అరంగేట్రం చేస్తున్నారు. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రానికి రాధా కష్ణ దర్శకుడు. శుక్రవారం మేకర్స్‌ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్‌ సినిమా టోన్‌, హిలేరియస్‌, ఫుల్‌-ఆన్‌ ఎంటర్‌టైనింగ్‌ స్నాప్‌షాట్‌ను అందిస్తుంది. కిరీటి ఒక రిలాక్స్డ్‌ కాలేజీ కుర్రాడు. మార్క్స్‌ కంటే హ్యాపినెస్‌ని ఇష్టపడతాడు. తన చుట్టూ ఉన్న వారిని ఆకర్షించే వ్యక్తిత్వం ఉన్న తను శ్రీలీలాను ఇష్టపతాడు. తన డ్యాన్స్‌ మూవ్స్‌, స్టంట్స్‌, స్పాట్‌-ఆన్‌ కామిక్‌ టైమింగ్‌ అద్భుతంగా ఉన్నాయి. హీరోయిన్‌గా శ్రీలీల కూల్‌గా కనిపించింది. టీజర్‌ చివరిలో బాస్‌ పాత్రతో జెనీలియా డిసౌజా కనిపించడం మరింత ఆసక్తికరంగా ఉంది. వైవా హర్ష పాత్ర కామిక్‌ రిలీఫ్‌ని ఇచ్చింది. కె.కె.సెంథిల్‌ కుమార్‌ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. విజువల్స్‌ చాలా గ్రాండ్‌గా ఉన్నాయి. దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం ఎనర్జీ, సినిమాటిక్‌ పంచ్‌తో అలరించింది. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మలయాళ భాషలలో జూలై 18న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది అని చిత్ర యూనిట్‌ తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -