కర్ణాటక మాజీ మంత్రి, పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న మూవీ ‘జూనియర్’. వారాహి చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. మేకర్స్ ఇటీవల ప్రకటించిన ప్రకారం ఈ సినిమా జూన్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా మ్యూజికల్ జర్నీని ప్రారంభిస్తూ ఫస్ట్ సింగిల్ ‘లెట్స్ లివ్ దిస్ మోమెంట్’ను విడుదల చేశారు.
హీరో కిరీటి రెడ్డి మాట్లాడుతూ,’ నా తొలి సినిమాకి దేవిశ్రీప్రసాద్, లెజెండ్రీ డిఓపి సెంథిల్, నిర్మాత సాయి ఇలా అద్భుతమైన టీంతో కలిసి పని చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. లెజెండరీ యాక్టర్ రవిచంద్రన్ ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించి, మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. శ్రీ లీల, జెనీలియా వర్క్ చేయటం మంచి అనుభూతినిచ్చింది. నా ఆరాధ్య దైవం పునీత్ రాజ్ కుమార్. అలాగే ఎన్టీఆర్‌కి ఒక అభిమానిగా ఆయనకు అడ్వాన్డ్ హ్యాపీ బర్త్డే చెబుతున్నా. ఆయన మాలాంటి ఎంతోమందికి ఇన్స్పిరేషన్. చాలా మంచి సినిమా తీశాం. దేవిశ్రీ నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ ఇచ్చారు. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది’ అని అన్నారు.
‘దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి మ్యూజిక్ చేయడం ఒన్ ఆఫ్ దిప్రౌడ్ మూమెంట్ ఇన్ మై లైఫ్. లైఫ్ లాంగ్ మెమరీ. ఇందులో ప్రతి సాంగ్ చాలా స్పెషల్. మరిన్ని అద్భుతమైన పాటలు రాబోతున్నాయి. ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్ చాలా స్పెషల్‌గా ఉండబోతుంది. ఇది నా రెండో సినిమా’ అని డైరెక్టర్ రాధాకృష్ణ చెప్పారు.
దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ,’ఈ సినిమాలో పార్ట్ కావడం చాలా ఆనందంగా ఉంది. డైరెక్టర్ రాధాకష్ణ సినిమాని చాలా ప్రత్యేకంగా తీశారు. స్క్రిప్ట్ చాలా యూనిక్‌గా ఉంటుంది. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. వెరీ ఎమోషనల్ అండ్ టచ్చింగ్ స్టోరీ. శ్రీమణి చాలా అద్భుతమైన సాహిత్యం రాశారు. ట్యూన్‌కి బ్యూటీని యాడ్ చేశారు’ అని తెలిపారు.
యూనిక్ పాయింట్‌తో ‘జూనియర్’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES