నవతెలంగాణ-హైదరాబాద్: మయన్మార్ జుంటా చీఫ్ మిన్ ఆంగ్ హ్లెంగ్ శుక్రవారం దేశాధ్యక్షుడిగా శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. సైనిక తిరుగుబాటు ద్వారా అధికారాన్ని చేజిక్కించుకున్న ఐదేళ్ల తర్వాత నేడు ఆయన అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. 2021లో ఆంగ్‌సాన్ సూకీ ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసి, ఆమెను నిర్బంధించి అంతర్యుద్ధానికి దారితీశారు. ఐదేళ్ల నియంతృత్వంతో పాలించిన తర్వాత, ఆయన ఆంగ్‌సాన్ సూకీ పార్టీని మినహాయించి ఈ ఏడాది జనవరిలో ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో తనకు మద్దతునిచ్చిన మిత్రులకు విజయాన్ని అందించారు.
కాగా, మిన్ ఆంగ్ హ్లెంగ్ ప్రమాణస్వీకారం ఆ దేశ రాజధాని నైపిడాలో జరిగింది. ఈయన అధ్యక్షుడిగా ఐదేళ్లు కొనసాగనన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. మయన్మార్ ప్రజాస్వామ్య మార్గంలోకి తిరిగి వచ్చింది. మెరుగైన భవిష్యత్తువైపు పయనిస్తోంది అని అన్నారు.



