- Advertisement -
నవతెలంగాణ – అశ్వారావుపేట
కాంగ్రెస్ సీనియర్ నాయకులు,రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి,ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ప్రధాన అనుచరుడు జూపల్లి రమేష్ పుట్టిన రోజు వేడుకలను శనివారం ఆయన అభిమానులు,అనుచరులు,కాంగ్రెస్ శ్రేణులు మండల వ్యాప్తంగా నిర్వహించారు. నందమూరి నగర్ లోని జారె ఆదినారాయణ కాలనీలో జూపల్లి ప్రమోద్ ఆద్వర్యంలో బర్త్ డే కేక్ కట్ చేసి,స్వీట్లు పంపిణీ చేసారు. పలువురు రాజకీయ నాయకులు,అధికారులు,మీడియా ప్రతినిధులు రమేష్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -



