- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: సౌతాఫ్రికా-ఏ తో జరుగుతున్న రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ధృవ్ జురెల్ రెండు ఇన్నింగ్స్ ల్లోనూ శతకాలతో చెలరేగాడు. శనివారం మూడో రోజు రెండో ఇన్నింగ్స్ లో 116 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత జట్టును జురెల్ 125 పరుగుల చేసి ఆదుకున్నాడు. అటు తొలి ఇన్నింగ్స్ లోనూ 132 పరుగులు చేసాడు. బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు చేయడంతో సౌతాఫ్రికాతో జరగబోయే తొలి టెస్ట్ లో చోటు దాదాపు కన్ఫర్మ్ అయింది.
- Advertisement -



