ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా ఒక రియాలిటీ షోను ప్రజా ఆర్ట్స్ ప్రొడక్షన్స్ ప్రారంభం చేయనుంది. అయితే దేశంలోనే తొలిసారిగా కేవలం సామాన్యులు మాత్రమే గేమ్‌లో ఉండే విధంగా ‘ది లక్’ రియాలిటీ షో ఉండబోతుందని నిర్వాహక బృందం తెలిపింది. ఈ సందర్భంగా ‘ది లక్’ పోస్టర్‌ను లాంచ్ చేశారు. ఈ షో గురించి మీడియాతో నిర్వాహక బృందం మాట్లాడుతూ,’ఇందులో గెలుపొందిన ప్రతి విజేతకు రూ.10 లక్షల బహుమతి అందజేస్తాం. మా వెబ్‌సైట్‌లో రిజిస్ట్రర్ చేసుకున్న విశ్వసనీయ సబ్‌స్కైబర్స్‌లో నుంచి యాదచ్ఛికంగా ఎంపిక చేస్తాం. దీనికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదు. పూర్తిగా ఉచితం’ అని చెప్పింది.
ఈ షోకి నిర్మాత: ప్రశాంత్, క్రియేటివ్ డైరెక్టర్స్: శ్రేయాస్ సిఎం, సూర్య తోరమ్స్, అపురూప, నిర్వాహకులు: మహర్షి నీల, హరిప్రియ మొదలవలస,
డిఓపి: భాను తేజ, లైన్ ప్రొడ్యూసర్: ప్రవీణ్ బాల.
కేవలం సామాన్యుల కోసం..
- Advertisement -
- Advertisement -