Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeరిపోర్టర్స్ డైరీజర ఆలోచించండి...

జర ఆలోచించండి…

- Advertisement -

అది రాష్ట్ర సచివాలయం. అక్కడి ఓ మంత్రి ఛాంబర్‌లోకి ఏదో జిల్లా నుంచి వచ్చిన ఓ పది మంది కార్య కర్తలు వచ్చి కూర్చున్నారు. ఓ అరగంట తర్వాత మంత్రి వారికి అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. ‘అన్నా… ఎంతో దూరం నుంచి వచ్చినం. మాకు సంబంధించిన ఓ చిన్న సమస్య ఇది. మీరు దయతలిచి ఈ కాగితం మీద సంతకం పెట్టి, సంబంధిత శాఖ మంత్రికి లేఖ రాస్తే మా పనైపోతది. మిమ్మల్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటం…’ అంటూ వారు మినిష్టర్‌ను వేడుకున్నారు. వారు ఇచ్చిన అర్జీని ఆసాంతం చదివిన ఆ మంత్రి…’చూడండి తమ్ముళ్లు…నేను ఏదైనా లేఖ రాసిన్నంటే, కచ్చితంగా పనైపోవాలే. కానీ మీరు పెట్టిన దరఖాస్తు నిబంధనలకు విరుద్ధంగా ఉంది, దాన్ని నేను చూడకుండా, చదవకుండా గట్లనే ఆ శాఖ మినిష్టర్‌కు పంపిన్నను కోండి, ఆయన ముందు నా పరువేంగావాలే… కనీసం రూల్స్‌ ఎలా ఉన్నాయో తెలుసుకోకుండా గిట్ల లెటర్‌ రాస్తరా భారుసాబ్‌.. అని ఆయన నన్ను అడుగుతడు… అందుకే రూల్స్‌ పరిధిలో నేనేం చెయ్యాలో గావిషయం చెప్పురి, గట్లకాకుండా మీరు జెప్పిన పద్ధతుల్లో నేను పని జెయ్యలేను తమ్మీ…’ అంటూ సర్దిజెప్పారు మంత్రి. నిజమే…రూల్స్‌ తప్పితే ఎప్పుడైనా, ఎవరి కొంపైనా మునగొచ్చు మరి…
-బి.వి.యన్‌.పద్మరాజు

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad