Saturday, August 16, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ రాజ్యాంలో పేదవాడికి న్యాయం 

ఇందిరమ్మ రాజ్యాంలో పేదవాడికి న్యాయం 

- Advertisement -

పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోయడ శ్రీనివాస్ 
నవతెలంగాణ – పరకాల 
: ఈరోజు పరకాల పట్టణ కేంద్రంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు చలో ఎల్బీ స్టేడియం హైదరాబాద్ మల్లికార్జున్ ఖర్గే బహిరంగ సభకు పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బయలుదేరడం జరిగింది. ఈ సందర్భంగా కొయ్యడ శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందన్నారు. మల్లికార్జున్ ఖర్గే దేశంలో ఎక్కడలేని విధంగా గ్రామస్థాయి అధ్యక్షులతో సమావేశాలు ఏర్పాటు చేశారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడ్డ కార్యకర్తలకు తప్పకుండా అవకాశాలు కల్పించాలని బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సభ ద్వారా ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే సంక్షేమ పథకాలు గ్రామస్థాయి వాటి స్థాయి అందే విధంగా ప్రజలకు చేరవేసే విధంగా ఉంటుంది అని కొయ్యడ శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో కుంకుమేశ్వర్ టెంపుల్ చైర్మన్ సుమన్వె, కమిటీ సభ్యులు ఒంటెరు రామ్మూర్తి, ఎండి రంజాన్ అలీ, మడికొండ సంపత్, రాఘవరెడ్డి, వెంకటస్వామి, బుర్ర రాజముగిలి, నలేల అనిల్, రఘుపతి గౌడ్, శ్రీశైలం గౌడ్, వంటేరు శ్రావణి, కుమార్, మంద నాగరాజు, బొమ్మగంటి చంద్రమౌళి, లక్కం శంకర్, బొచ్చు బాబు, గొట్టి రమేష్, జితేందర్, యాకుబూ పాషా, కిషోర్, రవి, సీను, రవి కుమార్, తదిరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad