Tuesday, March 3, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకుమ్మెర గ్రామ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి

కుమ్మెర గ్రామ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి

- Advertisement -

ప్రభుత్వం మొండి వైఖరి వీడాలి : రజక సంఘాల ఐక్య కార్యాచరణ పోరాట కమిటీ
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్‌

కుమ్మెర గ్రామ రజక, దళిత కుటుంబానికి న్యాయం చేయాలని రజక సంఘాల జేఏసీ డిమాండ్‌ చేసింది. సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రజక అభివృద్ధి సంస్థ వైస్‌ చైర్మెన్‌ ఎం నరసింహ అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహిం చారు. కుమ్మెర గ్రామంలో పది రోజుల క్రితం రజక, దళిత కుటుంబంపై అదే గ్రామానికి చెందిన అగ్రకుల పెత్తందారులు దాడి చేశారనీ, పసిపాపని కాలుతో తన్ని చంపిన అగ్రకుల పెత్తందారులపై ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫైళ్ళ ఆశయ్య ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొండి వైఖరి వీడాలనీ, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షురాలు కొత్తకొండ శ్రీలక్ష్మి, తెలంగాణ రజక రిజర్వేషన్‌ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, రజక అభివృద్ధి సంస్థ రాష్ట్ర చైర్మెన్‌, బొమ్మరాజు కృష్ణమూర్తి, జూపల్లి రాజశేఖర్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రజక సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షులు అక్కరాజు శ్రీనివాస్‌, అఖిలభారత రజక సంఘం అధ్యక్షులు మొగ్గ అనిల్‌ కుమార్‌, రజక జాగృతి అధ్యక్షులు బాలాపూర్‌ బాలరాజు, రజక సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ కొన్నె సంపత్‌, బీసీ పోరాట సమితి అధ్యక్షులు ఐతరాజు అభయేందర్‌, రజక పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు సిరిగల రమేష్‌, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎదునూరి మదార్‌, తెలంగాణ రజక సమితి కార్యదర్శి సకినాల రవి, పెద్దాపురం కుమార్‌, గంపల శ్రీనివాస్‌, మరియల గోపాల్‌,పెద్దాపురం భాస్కర్‌, షర్టు దుర్గాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -