Sunday, March 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంభూదాన్‌ బాధితులకు వెంటనే న్యాయం చేయాలి

భూదాన్‌ బాధితులకు వెంటనే న్యాయం చేయాలి

- Advertisement -

– కూల్చిన చోటే ఇండ్లు నిర్మించి ఇవ్వాలి : సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు
– ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూ బాధితుల పరామర్శ
నవతెలంగాణ-గాంధీచౌక్‌

వెలుగుమట్ల భూ బాధితులకు వెంటనే న్యాయం చేయాలని, కూల్చినచోటే ప్రభుత్వం బాధితులకు ఇండ్లు నిర్మించివ్వాలని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం పేదల ఇండ్లను కూల్చిన ఖమ్మం అర్బన్‌ మండలంలోని వెలుగుమట్ల ప్రాంతాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావుతో కలిసి ఆయన సందర్శించి బాధితులను పరామ ర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 10ఏండ్లకు పైగా వెలుగుమట్లలో ఇండ్లను నిర్మించుకొని 650 మంది పైబడిన పేద కుటుంబాలు నివసిస్తున్నారని, వారిని దాదాపు 2000 మంది పోలీ సులు మోహరించి ఖాళీ చేయించడం దుర్మార్గమని అన్నారు. యుద్ధ వాతావరణన్ని సృష్టించి కోట్ల రూపాయల ఆస్తిని నష్టం చేసి, ఇంతటి విధ్యంసాన్ని ఏ ప్రభుత్వమూ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్య వెనక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయో ప్రభుత్వం జిల్లాలోని ముగ్గురు మంత్రులు తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ ప్రాంతంలో భూదాన్‌ 62ఎకరాలుందని అనేక సందర్భాల్లో అధికా రులు, మీడియా సంస్థలు ప్రకటిస్తూ వచ్చాయని, ప్రస్తుతం సమస్య 31 ఎకరాల్లోని ఇండ్లను కూల్చారని, మిగతా 31ఎకరాల భూమి సంగతి ఏంటని ప్రశ్నించారు. కేవలం ఆసరాలేని పేదలపైన ప్రభు త్వం ప్రతాపం చూపుతూ, రియల్‌ ఎస్టేట్‌, వ్యాపారులకు, సంస్థలకు, ప్రయోజనం చేసేలా వ్యవహరించడం దారుణమని అన్నారు. సమస్య ను ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తామని, అప్పుడు కూడా పరి ష్కారం కాకపోతే పెద్దఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. పరామర్శించినవారిలో పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, ఖమ్మం డివిజన్‌ కార్యదర్శి వై.విక్రమ్‌, రాష్ట్రకమిటీ సభ్యులు బండి రమేష్‌, బుగ్గవీటి సరళ, మాచర్ల భారతి, నాయకులు ఎర్ర శ్రీనివాస రావు, మెరుగు సత్యనారాయణ, బొంతు రాంబాబు, కళ్యాణ వెంకటేశ్వర రావు, బండి పద్మ, పొన్నం వెంకటేశ్వర్లు, బండారు రమేష్‌, దొంగల తిరుపతిరావు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -