– ప్రమాణం చేయించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ లోకాయుక్తగా జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి, ఉప లోకాయుక్తగా జస్టిస్ జగ్జీవన్ కుమార్ సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసన మండలి చైర్మ్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, షబ్బీర్ అలీ, వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. కాగా లోకాయుక్తగా జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి, ఉప లోకాయుక్తగా జస్టిస్ జగ్జీవన్ కుమార్ ఆయా పదవుల్లో ఐదేండ్ల పాటు కొనసాగనున్నారు.
లోకాయుక్తగా జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ
- Advertisement -
RELATED ARTICLES