Friday, September 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జానపద కళాకారులకు న్యాయం చేయాలి

జానపద కళాకారులకు న్యాయం చేయాలి

- Advertisement -

– కామారెడ్డి జిల్లా ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు
నవతెలంగాణ –  కామారెడ్డి

22.08.2025 ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలకు, నాతోటి కళాకారులకు ప్రపంచ జానపద దినోత్సవశుభాకాంక్షలు. చిన్నప్పటినుండి కళను నమ్ముకొని బ్రతుకుతున్న కళాకారులకు ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని కోరుకుంటున్నాము  అని కామారెడ్డి జిల్లా ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం  జిల్లా అధ్యక్షులు పాల్వంచ మండలం సింగరాయపల్లి గ్రామానికి చెందిన సొంటెం సాయిలు యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భాషా సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు మా కళాకారుల తరఫున  మేము విన్నవించుకోవడమేమనగా..  గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిజమైన ఉద్యమ కళాకారులకు అన్యాయం జరిగిన విషయం తెలంగాణలోని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వంలో మా కళాకారులకు న్యాయం జరిగేలా చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నామని, ఏ ప్రభుత్వమైనా  మా  పేద కళాకారుల ను ఆదుకుంటుందని కోరుకుంటున్నామన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -