దిగుబడి రాకపోతే ఆర్గనైజర్లు, కంపెనీలు పట్టించుకోవట్లేదు
కాంట్రాక్టు ఫార్మింగ్ యాక్టు ఉల్లంఘన కాకుండా చూడండి
రైతు కమిషన్‌కు తెలంగాణ జాగృతి అధ్యక్షులు కవిత వినతి
రైతుకు విత్తనంపై హక్కు కల్పించే దిశగా అడుగులు : రైతు కమిషన్ చైర్మెన్ కోదండరెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
విత్తన రైతులకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత విన్నవించారు. గురువారం హైదరాబాద్‌లో రైతు కమిషన్ చైర్మెన్ కోదండరెడ్డి, సభ్యులతో కవిత సమావేశమయ్యారు. అందులో రైతు కమిషన్ సభ్యులు గోపాల్ రెడ్డి, భవానీ రెడ్డి, నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గొంగళ్ల రంజిత్ కుమార్, కన్వీనర్ బుచ్చిబాబు, జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్. రూప్ సింగ్, ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, రైతు జాగృతి అధ్యక్షులు నవీన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా కవిత మాట్లాడుతూ.. మన రాష్ట్రంలోని రైతులు 60 రకాల విత్తనాలను పండిస్తూ ‘సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా’ గా తెలంగాణను చేసేందుకు కషి చేస్తున్నారన్నారు. అయితే, కాంట్రాక్టు ఫార్మింగ్ చట్టం విత్తన రైతులకు అమలు కావడం లేదని వాపోయారు. పత్తి విత్తన రైతులకు ఇచ్చే అడ్వాన్స్‌లకు వడ్డీ కట్టడం, రైతులతో భూములు రాయించుకోవడం దారుణమని ఎత్తిచూపారు. కరీంనగర్ లో వరి సీడ్ పండిస్తున్న రైతులకు ఎకరానికి 75 వేలు ఇస్తున్నారనీ, గద్వాలో మాత్రం పత్తి విత్తనాలు పండించే రైతులకు ఇవ్వడం లేదని ప్రస్తావించారు. పైగా, 250 గ్రాముల పత్తి విత్తనాలను తరుగు తీస్తున్నారని వాపోయారు. కరీంనగర్‌లో వరి సీడ్ పండించే రైతులకు ప్రొక్యూర్ చేసిన తర్వాత మిగిలిన వాటిని కమర్షియల్‌గా అమ్ముకునే ఫ్రీడమ్ ఉందనీ, ఆ హక్కు గద్వాల రైతులకు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీడ్ పత్తి ఆర్గనైజర్లు, మీడియేటర్లు రైతులను పట్టిపీడుస్తున్నారని వాపోయారు. ఆ రైతులకు కూడా రూ.75 వేలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. సీడ్ ఫెయిల్ అయితే కంపెనీలే బాధ్యత వహించేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు. గద్వాల్ జిల్లాలో 10 వేల మంది సీడ్ పత్తి రైతులకు రూ. 2 వందల కోట్ల బకాయిలు ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. కోదండరెడ్డి మాట్లాడుతూ…కవిత ప్రతిపక్ష నాయకురాలిగా పనిచేస్తున్నదని కొనియాడారు. ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం మంచి సాంప్రదాయమని చెప్పారు. గద్వాల పత్తి విత్తన రైతులకు న్యాయం చేసేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించి కలెక్టర్ ఆధ్వర్యంలో అక్కడే సమావేశం నిర్వహిమన్నారు. ఆర్గనైజర్ల నుంచి వస్తున్న ఇబ్బందులను ప్రస్తావించారు. రూ.200 కోట్ల బకాయిల అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. రైతుకు విత్తనంపై హక్కు కలిగించేలా కసరత్తు చేస్తున్నామన్నారు. విత్తన కంపెనీల పనితీరు బాగోలేదని విమర్శించారు. బీటీ విత్తనాలు, కలుపు మందులపై నిషేధం ఉందని గుర్తుచేశారు. ఎర్రజొన్న విత్తన రైతులు కూడా అలర్ట్‌గా ఉండాలని సూచించారు. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి వచ్చే పంటలపై రైతులు దృష్టిసారిం చాల న్నారు. కమిషన్ సభ్యులు గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ… ఆర్గానిక్, ప్రకృతి వ్యవసాయాలపై రైతులు మొగ్గు చూపాలని సూచించారు. ములుగు జిల్లాలో మొక్కజొన్న విత్తనోత్పత్తి చేసిన నష్టపోయిన రైతులకు దేశంలోనే తొలిసారిగా రూ.4 కోట్ల నష్టపరిహారం ఇప్పించిన విషయాన్ని గుర్తుచేశారు. దేశంలో మొదటి సారిగా విత్తనకంపెనీల నుండి 4 కోట్ల నష్టపరిహారం అందించాం.
విత్తన రైతులకు న్యాయం చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



