Wednesday, September 24, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుహక్కుల పరిరక్షణకు జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి గెలుపు అవసరం

హక్కుల పరిరక్షణకు జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి గెలుపు అవసరం

- Advertisement -
  • కాంగ్రెస్‌, సీపీఐ(ఎం), సీపీఐ సంపూర్ణ మద్దతు
  • బీఆర్‌ఎస్‌ సైతం ఆలోచించాలి
  • బీజేపీ పాలనలో రాజ్యాంగం, లౌకికత్వంధ్వంసం
  • యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వ అలసత్వమే కారణం
  • 17 వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు
  • రామోజీ ఫిలిం సిటీలో పేదలకు ఇండ్ల స్థలాలివ్వాలి : ఇబ్రహీంపట్నంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
    నవతెలంగాణ- ఇబ్రహీంపట్నం
    భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం ప్రతిపక్షాలు బలపరిచిన ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్‌రెడ్డి గెలుపు ఎంతో అవసరమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. ఆయన గెలుపునకు రాష్ట్రంలోని రాజకీయ పక్షాలు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు. ఇప్పటికే సీపీఐ(ఎం), సీపీఐ, కాంగ్రెస్‌ సంపూర్ణ మద్దతు ప్రకటించాయని, బీఆర్‌ఎస్‌ పార్టీ సైతం ఆలోచించి సుదర్శన్‌రెడ్డికి మద్దతు ప్రకటించాలని కోరారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నంలోని పాషా నరహరి స్మారక కేంద్రంలో మంగళవారం

    జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. దేశంలో బీజేపీ అధికారం చేపట్టిన నాటి నుంచి రాజ్యాంగ హక్కులను, లౌకిక, ప్రజాస్వామ్య వ్యవస్థలను దెబ్బతీస్తోందని విమ ర్శించారు. ఎన్నికల కమిషన్‌ను సైతం తన జేబు సంస్థ గా మార్చుకుం దన్నారు. తన అనుకూల ఓట్లను చేర్పిస్తూ, ప్రతిపక్షాల ఓట్లను తొలగించే కుట్ర పన్నుతోందని తెలిపారు. నియంతృత్వ విధానాలు అవలంబిస్తోందని విమర్శించారు. ఈ తరుణంలో దేశంలో ఉపరాష్ట్రపతి ఎన్నికలు తెరమీదకి వచ్చాయని చెప్పారు. భారత రాజ్యాంగాన్ని, హక్కులను పరిరక్షించుకునేందుకు ప్రతిపక్షాలు బలపరిచిన ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్‌రెడ్డిని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. సుదర్శన్‌ రెడ్డికి మెజార్టీ తీసుకురావాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్రంపై ఉందన్నారు.
    రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడటానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలే కారణమని విమర్శించారు. ఇంకా రాష్ట్రానికి నాలుగున్నర లక్షల టన్నుల యూరియా రావాల్సి ఉందన్నారు. యూరియా కోసం రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం చేస్తున్న ఆందోళనలకు సీపీఐ(ఎం) మద్దతు ప్రకటిస్తుందని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని శాసనసభ మరోసారి చేసిన తీర్మానానికి గవర్నర్‌ ఆమోదముద్ర తెలపాలని కోరారు.

    రామోజీ ఫిలింసిటీలో పేదలకు ఇండ్ల స్థలాల విషయంలో అధికారులు, ప్రభుత్వం చేసిన వాగ్దానాన్ని నిలుపుకోవాలని కోరారు. అనాజ్‌పూర్‌ రైతాంగ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, రాష్ట్ర ప్రభుత్వం ఆ రైతుల సమస్యను పరిష్కరించాలని కోరారు. అనాజ్‌పూర్‌ రైతులకు పట్టాలు జారీ చేయాలన్నారు. చౌదర్‌పల్లిలో స్వయం సహాయక సంఘాలలో జరిగిన అవినీతిపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను ఈ నెల ఒకటి నుంచి 17 వరకు నిర్వహించాలని పిలుపునిచ్చారు. మోడీ ప్రభుత్వం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని హిందూ, ముస్లిం మధ్య ఘర్షణగా సృష్టించే ప్రయత్నం చేస్తోందని, దీన్ని తిప్పుకొట్టాలని సూచించారు. ఆ పోరాట స్ఫూర్తితో మతోన్మాదానికి వ్యతిరేకంగా ఉద్యమిం చాలని పిలుపునిచ్చారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలపై దృష్టి కేంద్రీకరించాలని కార్యకర్తలకు సూచించారు.

    12న రాష్ట్ర వ్యాప్తంగా సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి
    సీపీఐ(ఎం) మాజీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతిని ఈ నెల 12న గ్రామ గ్రామాన నిర్వహించాలని జాన్‌వెస్లీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పి.యాదయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సామెల్‌, నర్సింహ, కవిత, చంద్రమోహన్‌, డి.జగదీష్‌, జిల్లా కమిటీ సభ్యులు సి.శోభన్‌, పి.అంజయ్య, రావుల జంగయ్య, జె.రుద్ర కుమార్‌, సిహెచ్‌. బుగ్గరములు, కీసరి నర్సిరెడ్డి, కె.సుమలత, డి.కిషన్‌, పి.జగన్‌ పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -