Thursday, May 22, 2025
Homeజాతీయంజ్యోతి మల్హోత్రా కేసులో హర్యానా పోలీసులు కీల‌క ప్ర‌క‌ట‌న‌

జ్యోతి మల్హోత్రా కేసులో హర్యానా పోలీసులు కీల‌క ప్ర‌క‌ట‌న‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ-హైద‌రాబాద్‌: పాకిస్థాన్‌కు గూఢచార్యం చేస్తుందనే ఆరోపణ నేపథ్యంలో …. ఇటీవలే అరెస్టయిన యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే హర్యానా పోలీసులు ఓ కీలక ప్రకటన చేశారు. పాకిస్థాన్‌ ఇంటెలిజెన్స్‌ ఆపరేటివ్స్‌తో జ్యోతి సంప్రదింపులు జరిపారనే విషయం స్పష్టమైందని అన్నారు. కానీ ఉగ్రవాద కార్యకలాపాలు.. ఆ గ్రూపులతో సంబంధాలు ఉన్నట్లుగా ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. అదేవిధంగా ఆమెకు భద్రతా దళాల గురించి ఎలాంటి అవగాహన లేదని చెప్పారు. ఈ సందర్భంగా హిస్సార్‌ ఎస్పీ మాట్లాడుతూ …. పాక్‌ నిఘా వర్గాలకు చెందిన వ్యక్తిని జ్యోతి వివాహం చేసుకోవాలని లేదా మతం మార్చాలని అనుకున్నట్లుగా ఆమె వద్ద ఎలాంటి డాక్యుమెంట్లు లభించలేదని తెలిపారు. జ్యోతికి చెందిన మూడు మొబైల్‌ ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్‌, ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్స్‌, వీసా ఏజెంట్‌ హర్కిరత్‌ సింగ్‌కు చెందిన రెండు మొబైల్‌ ఫోన్లలో డేటా రిట్రైవ్‌ చేసేందుకు లాబ్‌కు పంపామని ఎస్పీ వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -